పల్లవి:
ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ
నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ
మెత్తని మనసును ఏ రోజూ ఈడదు ఈ ప్రేమ
కులమూ మతమూ లేవంటుంది మనసుకి ప్రేమ
నింగీ నేలా ఉన్నన్నాళ్లు ఉంటుందీ ప్రేమ... ||ఎవ్వరు||
చరణం1:
కాలమొస్తే సిరిమల్లెతీగకి
చిగురే పుడుతుంది
ఈడువస్తే ఈ పడుచు గుండెలో
ప్రేమే పుడుతుంది
గొడుగు అడ్డు పెట్టినంతనే
వానజల్లు ఆగిపోవునా
గులక రాయి వేసినంతనే
వరదజోరు ఆగిపోవునా
ఏడులోకాలు ఏకం ఐనా
ప్రేమను ఆపేనా... ||ఎవ్వరు||
చరణం2:
ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన
చక్కని వరమంటా
ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ
అలుపేరాదంటా
కండలెంత పెంచుకొచ్చినా
కొండనెత్తి దించలేరుగా
కక్షతోటి కాలు దువ్వినా
ప్రేమనెవ్వరాపలేరుగా
ప్రేమకెపుడైనా జయమేగాని
ఓటమి లేదంటా. .. ||ఎవ్వరు||
శాశ్వతమీప్రేమ...
Singer(s)(గానం) : ఆర్.పి.పట్నాయక్, ఉష
Lyricist(రచన) : కులశేఖర్
Music(సంగీతం) : R P Patnaik(ఆర్. పి.పట్నాయక్)
Movie(చిత్రం) : Jayam(జయం)(2002) —
No comments:
Post a Comment