PropellerAds

Thursday 23 March 2017

వేణువై వచ్చాను భువనానికి - మాతృదేవోభవ , చిత్ర హిట్ సాంగ్స్


వేణువై వచ్చాను భువనానికి Lyrics: share this song


వేణువై వచ్చాను భువనానికి..
గాలినై పోతాను గగనానికి..
వేణువై వచ్చాను భువనానికి..
గాలినై పోతాను గగనానికి..

మమతలన్ని మౌన గానం..
వాంఛలన్నీ వాయులీనం..||వేణువై ||

మాతృదేవోభవ మాతృదేవో భవ
పితృదేవోభవ పితృదేవో భవ
ఆచార్యదేవోభవ ఆచార్యదేవో భవ

ఏడు కొండలకైన బండ తానొక్కటే..
ఏడు జన్మల తీపి ఈ బంధమే..
ఏడు కొండలకైన బండ తానొక్కటే..
ఏడు జన్మల తీపి ఈ బంధమే..
నీ కంటిలో నలత లో వెలుగునే కనక..
నేను మేననుకుంటే ఎద చీకటే..
హరీ..హరీ..హరీ..
రాయినై ఉన్నాను ఈ నాటికి..
రామ పాదము రాక ఏ నాటికి..

వేణువై వచ్చాను భువనానికి..
గాలినై పోతాను గగనానికి..
వేణువై వచ్చాను భువనానికి..
గాలినై పోతాను గగనానికి..

నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో
నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో

ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు
హరీ..హరీ..హరీ..
హరీ...
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి..
గాలినై పోయాను గగనానికి..

No comments:

Sada ninnu song lyrics-Mahanati