PropellerAds

Friday, 31 March 2017

అదిరే అదిరే కన్నే అదిరే - నువ్వొస్తానంటే నేనొద్దంటానా



చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: జస్సి గిఫ్ట్, కల్పన

అదిరే అదిరే Lyrics: share this song


శివశివ మూర్తివి గణనాథా
శివశివ మూర్తివి గణనాథా
శివుని కొమరుడవు గణనాథా
శివుని కొమరుడవు గణనాథా
ఛల్ సిరికి హరికీ మనువంట
ఛల్ సిరికి హరికీ మనువంట
భళరే అనరా జనమంతా
భళరే అనరా జనమంతా
హేయ్ ఘల్లుమంటు గజ్జ కట్టి
చిందు కొట్టే జగమంతా

పల్లవి:
అదిరే అదిరే కన్నే అదిరే
అదిరే అదిరే కన్నే అదిరే
కుదిరే కుదిరే అన్నీ కుదిరే
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
మొదటిసారిగా ఎదురయిందిగా
వయసు వేడుకా ఓ... ఓ...

అదిరే అదిరే కన్నే అదిరే
కుదిరే కుదిరే అన్నీ కుదిరే

చరణం1:
ఏం మాయ మెలికో కలికి ఒంటి కులుకో
నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో
ఏం నిప్పు కణికో అదేం పంటి కొరుకో
వగలువాడలో నెగడు వేస్తే నువ్ సొగసుకాడవనుకో
హెయ్ వరసై పిలిచే అందాలు
అరె మనమై చిలికే గంధాలు
అహ మనసే గెలిచే పంతాలు
అరె మనువై కలిపే బంధాలు
రణము చేయగా రమణి కోరిక అదుపు దాటగా

అదిరే అదిరే కన్నే అదిరే
ఓ కుదిరే కుదిరే అన్నీ కుదిరే

చరణం2:
పన్నీటి చినుకో పసిడిపంట జిలుగో
కాలిమెట్టెగా తాళిబొట్టుగా జంట చేరెనిదిగో
పందార తునకో పదం లేని తెలుగో
మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకెనిదిగో
హే ఎదురై రానీ మేనాలు
హో హో చెవిలో పడనీ మేళాలు
అరె అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు
మదన దీపిక మదిని మీటగ ఎదురు లేదుగా

అదిరే అదిరే కన్నే అదిరే
హే కుదిరే కుదిరే అన్నీ కుదిరే హేయ్...

No comments:

Sada ninnu song lyrics-Mahanati