PropellerAds

Friday, 17 March 2017

గుండెల్లో ఏముందో -ఆంధ్రుడు


గుండెల్లో ఏముందో చెప్పేది కాదే ఆపేదే లేదే
ఏ రోజేంచెయ్యాలో ఆలోచిస్తుందే నీ కంటే ముందే
ఈ మనసుది ఎగసిపడే అలల గుణం
ఇది నిజం నిజం నిలవదే క్షణం
ఇక నిరంతరం మనసుతో మనం (2)

ఇన్నాళ్ళు ఎవరికివారే ఏమి కారే మరి ఎమైందో ఏకం అయ్యారే
దూరాన్ని దూరం దూరం పో పొమ్మంటు చిత్రంగా చేతులు కలిపారే
ఇది మనసు చేసిన ఓ వింత గారడి కాబట్టి బంధం కుదిరిందే
ఇపుడే కథ మొదలంటా దీనికి చివరేదంటా తెలిసే వీలే లేదే

గుండెల్లో ఏముందో చెప్పేది కాదే ఆపేదే లేదే
ఏ రోజేంచెయ్యాలో ఆలోచిస్తుందే నీ కంటే ముందే
ఈ మనసుది ఎగసిపడే అలల గుణం
ఇది నిజం నిజం నిలవదే క్షణం

బంధుత్వాలన్ని దైవం ఇచ్చినవేలే స్నేహాన్ని నువ్వే వెతికావే
త్యాగానికి అర్దం ఉంటే రానిస్తుందే చెలిమయ్యి నిన్నల్లేసిందే
వేషంతో శ్రీకారం చుట్టింది ఈ బంధం ఇంకెన్ని మలుపులు తిరిగేనో
కాలం గడిచేదాకా తీరం చేరేదాకా తెలిసే వీలే లేదే

గుండెల్లో ఏముందో చెప్పేది కాదే ఆపేదే లేదే
ఏ రోజేంచెయ్యాలో ఆలోచిస్తుందే నీ కంటే ముందే
ఈ మనసుది ఎగసిపడే అలల గుణం
ఇది నిజం నిజం నిలవదే క్షణం
ఇక నిరంతరం మనసుతో మనం.....

చిత్రం : ఆంధ్రుడు (2005)
సంగీతం : కళ్యాణి మాలిక్
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : రంజిత్ , సాహితి

No comments:

Sada ninnu song lyrics-Mahanati