నువ్వు లేక అనాధలం Lyrics: share this song
సాయి బాబా ....సాయిబాబా....సాయినాధా....సాయిదేవా....
సత్యం నిత్యం నీవేకావా
పల్లవి:
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నీరీక్షణ మేమోర్వలేము
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం
నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం
బాబా ఓ బాబా
చరణం1:
మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి....
శ్రీరాముడైనా....శ్రీకృష్ణుడైనా.... ఏ దైవమైనా .
నీలోనేచూచాము సాయి....
రావా....బాబా....రావా....
రక్షా....రక్షా నీవేకదా మా బాబా .. నువ్వు..
చరణం2:
మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని
ప్రార్ధనలు చేశామయా నిన్నే...
అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని
చేశాము సలాం సలాం నీకే
గురునానకైనా ....గురుగోవిందైనా....
గురుద్వారమైనా...నీ ద్వారకేననీ
నీ భక్తులైనాము సాయి....రావా .. నువ్వు..
కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి ( 2 )
అల్లాసాయి మౌలాసాయి ( 2 )
నానక్ సాయి గోవింద్ సాయి
ఏసు సాయి షిర్డి సాయి ఓం... నానక్ ..
సాయి సాయి బాబా సాయి.....
చిత్రం : శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
రచన : ఆత్రేయ
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం & కోరస్
No comments:
Post a Comment