చిలక ఏ తోడు లేక Lyrics: share this song
పల్లవి:.. ఆ... ఆ... ఆ...
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
||చిలక||
చరణం1:
బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే ||2||
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
||చిలక||
చరణం2:
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో ||2||
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమవాసలో
తీరా నువు కనుతెరిచాక తీరం కనపడదే ఇంకా
||చిలక||
No comments:
Post a Comment