PropellerAds

Friday, 17 March 2017

వెన్నెలైనా చీకటైనా -ప్రేమ కథా చిత్రమ్


వెన్నెలైనా చీకటైనా Lyrics : Share this song


పల్లవి :
వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా
నీతొనే జీవితమూ నీప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధమూ
ఏ జన్మదో ఈ బంధమూ నింగి నేలా
సాక్ష్యాలు
నింగి నేలా సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు

చరణం1:
జ్ఞాపకమేదో నీడల్లే తారాడే
స్వప్నాలేవో నీ కళ్ళలోఆడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదూ
చుక్కలైనా నిన్ను నన్ను
చూడకూడదూ
నీ సర్వమూ.. నాదైనదీ
నేను దేహమల్లే నీవు ప్రాణమల్లే
ఏకమైన రాసలీలలోనా

చరణం2:
అంతంలేనీ నీ రాగబంధంలో
అంచున నిలిచీ నీవైపే చూస్తున్నా
పున్నమింట కట్టుకున్న పూల
డోలలూ
ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలూ
ఆముద్దులే మూడైనవీ
బాలచంద్రుడొస్తే నూలుపోగులిస్తా
ఇంటి దీపమాయె జంట ప్రేమ

వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా
నీతొనే జీవితమూ నీప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధమూ
ఏ జన్మదో ఈ బంధమూ నింగి నేలా
సాక్ష్యాలు
నింగి నేలా సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు..


చిత్రం : ప్రేమ కథా చిత్రమ్ ( 2013 )
సంగీతం : జె.బి
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : మాళవిక, రేవంత్


No comments:

Sada ninnu song lyrics-Mahanati