అరె ఏమైంది Lyrics: share this song
పల్లవి:అరె ఏమైందీ..
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి
ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు
ఇక్కడొచ్చి వాలిందీ
కల కాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతని నిద్దురలేపింది..
అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి
ఎక్కడికొ ఎగిరిందీ.. అది ఏమైందీ
చరణం1:
నింగి వంగి నేల తోటి నేస్తమేదొ కోరింది
నేల పొంగి నింగి కోసం పూల
దోసెలిచ్చింది
పూలు నేను చూడలేను
పూజలేమి చేయలేను
నేలపైన కాళ్ళు వేరు
నింగి వైపు చూపు వేరు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావూ...
చరణం2:
ఈడులోన వాన చినుకు పిచ్చిమొలక
వేసింది
పాడలేని గొంతులోనా పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె
పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు
రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి రాసాడో
చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు
మనిషవుతాడూ...
అరె ఏమైందై ఒక మనసుకి రెక్కలొచ్చి
ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు
ఇక్కడొచ్చి వాలిందీ..
కల కాని కల ఏదో కల్లెదుతే నిలిచింది
అది నీలో మమతని నిద్దురలేపింది..
చిత్రం : ఆరాధన (1987)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
No comments:
Post a Comment