PropellerAds

Saturday, 1 April 2017

సెలవనుకో - హార్ట్ ఎటాక్



చిత్రం: హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చైత్ర


సెలవనుకో Lyrics : share this song

సెలవనుకో మరి ఏడవకే మనసా ఓ ఓ
కలగనకే అది నిజమై పోదుకదా
ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో
ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో
కన్నుల్లోని కన్నీటి కెరటాలలో ఓ ఓ
నేనేమై పోవాలి
నిన్నేమను కోవాలి
ఏ మనసుని తిట్టాలి
ఈ క్షణం హొ హొ ఓ...

సెలవనుకో మరి ఏడవకే మనసా ఓ ఓ
కలగనకే అది నిజమై పోదుకదా

అనుకున్నా అనుకున్నా నాతోనే వుంటావనుకున్న
నాలాగే నీక్కూడా నేనంటే ఇష్టం అనుకున్నా
పిలిచాన రమ్మని కసిరానా పొమ్మని
చివరికి ఈ ఆటలో అయిపోయా బొమ్మని
నువ్వు కాదంటే ఇక రానంటే
మన ఇద్దరిమద్య ఇంకేంలేదంటే

నేనేమై పోవాలి
నిన్నేమను కోవాలి
ఏ మనసుని తిట్టాలి
ఈ క్షణం...

సెలవనుకో మరి ఏడవకే మనసా ఓ ఓ

హో నువ్వంటే నాలాంటి ఇంకొనేనని అనుకున్నా
ఇన్నాళ్లి బ్రమ లోనే ఆనందంగా బ్రతికాన
నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని
చెబుతున్నా మనసుకి వింటుందా మాటని
నా ఊహాల్ని నా ఆశల్ని
నరికేస్తే నవ్వును చిదిమేస్తే

నేనేమై పోవాలి
నిన్నేమను కోవాలి
ఏ మనసుని తిట్టాలి
ఈ క్షణం...

సెలవనుకో మరి ఏడవకే మనసా ఓ ఓ

No comments:

Sada ninnu song lyrics-Mahanati