హృదయం ఓర్చుకోలేనిది Lyrics: share this song
పల్లవి:
హృదయం ఒర్చుకోలేనిది గాయం
ఇక పై తలచుకోరానిది ఈ నిజం
పెదవులు విడిరాక... నిలువవే కడదాకా...
జీవం..లో ఒదగవే ఒంటరిగా
లో లో ముగిసే మౌనంగా ఓ..ఓ..ఓఓఒ
హృదయం ఒర్చుకోలేనిది గాయం
ఇక పై తలచుకోరనిది ఈ నిజం
చరణం1:
ఊహలలోకంలో ఎగరకు అన్నావే
తేలని మైకంలో పడకని ఆపావే
ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా
మరి నా కను పాపలలో నలుపై నిలిచావేమ్మా
తెలవారి తొలికాంతి నీవో... బలి కోరు పంతానివో
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ ఓ ఓ
హృదయం ఒర్చుకోలేనిది గాయం
ఇక పై తలచుకోరనిది ఈ నిజం
చరణం2:
వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు...
చల్లని చూపులతో దేవేనలిస్తాడు
అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమౌతాడు
చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు
హాలాహలం నాకు సొంతం నువ్వు తీసుకో అమృతం
అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలద ఓ ఓ ఓఓ ఓ ఓ
హృదయం ఒర్చుకోలేనిది గాయం
ఇక పై తలచుకోరనిది ఈ నిజం
No comments:
Post a Comment