PropellerAds

Thursday 13 April 2017

నేను నువ్వంటూ - ఆరెంజ్



నేను నువ్వంటూ Lyrics: share this song


పల్లవి:
నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళ నీలో నేనున్నట్టుగ
అనిపిస్తూ ఉందే వింతగ
నాకోసం నేనే వెతికేంతగా.. (O girl !)
నువ్వే లేకుంటే ( listen girl )ఏమవ్ తానో
నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా
కాదంటే నా మీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా

ఒకసారిచూసి నే వలచానా
నను వీడి పోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నాప్రేమ లోతులో మునిగాకా
నువ్వు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా..ఓ ఓ ఓ

నేను నువ్వంటూ వేరై ఉన్నా
నాకీవేళ నీలో నేనున్నట్టుగ
అనిపిస్తూ ఉందే వింతగ
నాకోసం నేనే వెతికేంతగా..ఓ

//నేను నువ్వంటూ//

చరణం1:
నిజాయతీ ఉన్నోడిని నిజాలనే అన్నోడిని
అబద్ధమే రుచించని అబ్బాయినీ
ఒకే ఒక మంచోడిని
రొమాన్స్ లో పిచ్చోడిని
పర్లేదులే ఒప్పేసుకో సరే అని
ముసుగేసుకోదు ఏనాడు నామనసే ఓ భామ
నను నన్నుగానే చూపిస్తూ
కాదన్నా పోరాడేదే నా ప్రేమా... ఓఓఓ

//నేను నువ్వంటూ//

చరణం2:
తిలోత్తమా తిలోత్తమా
ప్రతిక్షణం విరోధమా
ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా
ఓ ఓ గ్రహాలకే వలేసినా
దివే అలా దిగొచ్చినా
ఇలాంటి ఓ మగాడినే చూళ్ళేవమా
ఒకనాటి తాజ్‌మహలైనా
నా ముందు పూరిల్లె
ఇకపైన గొప్ప ప్రేమికుడే
లోకంలో నిలిచేపేరే నాదేలే…ఓ ఓ ఓ

//నేను నువ్వంటూ//

Singers: Naresh Iyer, Naadesh
Lyrics: Vanamaali
Music: Harris Jairaj

No comments:

Sada ninnu song lyrics-Mahanati