PropellerAds

Monday, 3 April 2017

చెలియా చెలియా - ఎవడు


చెలియా చెలియా Lyrics: share this song

మండే సూరిడల్లే నిండే నిప్పులల్లే
భగ భగమన్నది నీ హృదయం
పొంగే ఉప్పెనల్లే మింగె మృత్యువల్లే
పగ పగ అన్నది నా హృదయం
ఇలా ఇలా జ్వలించుతోంది నా ఎద
ఎడారిలా జలించే నా పగా

చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో
నిండె ఉందే నీ ప్రాణం

పువ్వేదో నన్ను తాకితే నవ్వేదో నన్ను చేరితే
నువ్వేదో అన్న తీపి ఙ్ఞాపకం
వెన్నెల్లు వెన్ను మీటితే కన్నీల్లు కన్ను దాటితే
నన్నల్లుకున్న చూపు ఙ్ఞాపకం
ప్రతీ దినం ప్రతీ క్షణం
నీ ప్రేమలో ప్రదక్షణం
తెగించమంది నన్నే తక్షణం

చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో
నిండె ఉందే నీ ప్రాణం

ప్రయానమాయె జీవితం
ప్రమాదమాయె నా పధం
శరీరమాయె మారణాయుధం
నరాల రక్త సాగరం
కణాల అగ్ని పర్వతం
కలేసి రాసే మృత్యు శాసనం
ఒకే వ్రతం వినాశనం
ఒకే విధం విధ్వంసనం
నా వేటకింక లేదే విరమనం

ఓ చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో
నిండె ఉందే నీ ప్రాణం

Movie    :  Yevadu
Lyrics    :  Chandrabose
Music    :  Devi Sri Prasad
Singer   :  K K

No comments:

Sada ninnu song lyrics-Mahanati