PropellerAds

Monday 10 April 2017

సిరులొలికించే చిన్ని నవ్వులే - యమలీల



ప్రేమకు ప్రతిరూపమైన మాతృ మూర్తి తన బిడ్డను చూసి మురిసిపోతూ పాడుతున్న  ఈ పాట మీకోసం ...నచ్చితే comments చేసి షేర్ చేయండి..



సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు
ఎదగాలీ ఇంతకు ఇంతై ఈ పసికూనా
ఏలాలీ ఈ జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి
నిండునూరేళ్లూ ॥

జాబిల్లి జాబిల్లి జాబిల్లి
మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి
నాలో మురిపెమంతా పాల బువ్వై పంచనీ
లోలో ఆశలన్నీ నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని చందమామే నువ్వనీ
ఊరూవాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ
కలకాలమూ కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ॥

వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్నప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా॥

చిత్రం : యమలీల (1994)
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : కె.ఎస్. చిత్ర, ఎస్.పి.బాలు


No comments:

Sada ninnu song lyrics-Mahanati