పాటల పల్లకివై Lyrics: ( sad version) share this song
పల్లవి : ( ఖోరస్ )
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ
కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకు సందడుండదే
నీ కోసమే అన్వేషణ..నీ రూపురేఖలేవో ఎవరినడగాలి
(పాటల)
చరణం:
హృదయాలు ఒడి చేర్చి ఓదార్చే చిరుగాలి
మమ్మల్ని జత చేసే వంతెనవు కావాలి
అద్దంలా మెరిసే ఓ హౄదయం పగిలింది
ఆ మదిలో వెలుగు చూపించే దారేది
రేయి పవలు తను వెతికే పాటకు చిరునామా
ఎదుటే ఇపుడు ఉన్నదని ఎదురై చెప్పమ్మా
ఈ మౌనమింక నీకు తగదు చిరుగాలీ
ప్రేమను ధ్యానించూ ప్రేమే ఒక జలపాతం
ప్రేమను పూజించూ ప్రేమే ఒక సంగీతం
(ఖోరస్) ( ప్రేమను ధ్యానించూ)
No comments:
Post a Comment