PropellerAds

Friday, 31 March 2017

లవ్ మి ఎగైన్ - నాన్నకు ప్రేమతో



లవ్ మి ఎగైన్ Lyrics : share this song


నిదరోని తూరుపు కోసం సూరీడే మళ్ళీ రాడా...
జతలేని తారల కోసం జాబిల్లే మళ్ళీ రాదా...
అడుగెయ్యని తీరం కోసం అలలైనా మళ్ళీ రావా...
అడుగుతున్నా నిన్నే మళ్ళీ...
ప్రేమించైవా...

ఓ.... లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...
లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...
కలలైనా కన్నీళ్లయినా...
కన్నులలో మళ్ళీ రావా...
గుబులైనా సంబరమైనా...
గుండెలలొ మళ్ళీ రాదా...
మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు...
నిన్న మొన్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవూ...
చూపిన కోపాన్నే మళ్ళీ నాపై చూపైవూ...
మళ్ళీ నన్నే ప్రేమించరాలేవా....
ఓ.... లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...
లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...

మనసారా బతిమాలానే...
మన్నించవే నను తొలిసారి...
పొరపాటే జరగదు లేవే...
ప్రేమించవే రెండోసారి...
మళ్ళీ వస్తాను మళ్ళీ చూస్తాను...
మళ్ళీ నీకె పరిచయమౌతాను...
మళ్ళీ నా మనసు నీకందిస్తాను...
అలవాటుగా నన్ను ప్రేమించవా...
ఓ..లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...
లవ్ మి‌ ఎగైన్... లవ్ మి‌ ఎగైన్...

Movie    : Nannaku Prematho
Lyrics    : Chandrabose
Music    : Devi Sri Prasad
Singer   : Sooraj Santosh

పారిపోకే పిట్టా - నువ్వొస్తానంటే నేనొద్దంటానా


చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్, సాగర్

పారిపోకే పిట్టా Lyrics: share this song

పల్లవి:
పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా
హే పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా
అంత మారాం ఏంటంట మాట వినకుండా
సరదాగా అడిగాగా మజిలీ చేర్చవా
తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట

చరణం1:
నా సంతోషాన్నంతా పంపించా తన వెంట
భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా
తన అందెలుగా తొడిగా నా చిందరవందర సరదా
ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా

హోయ్ చినబోయిందేమో చెలి కొమ్మ
ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా
నీ వాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి
నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా
తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట

హే పుటుక్కు జర జర డుబుక్కు మేఁ
పుటుక్కు జర జర డుబుక్కు మేఁ

చరణం2:
ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది
అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది
నిద్దర ఎదురయ్యింది తెగ చిరాగ్గ ఉన్నట్టుంది
తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది

హోయ్ ఏం గారం చేస్తావే ప్రేమ
నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా
ఆ సంగతి నీకూ తెలుసమ్మా
నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు
నిలిచాడో చెప్పమ్మా
తీసుకుపో నీ వెంట
ఓ ప్రేమా తీసుకుపో నీ వెంట
తీసుకుపో నీ వెంట అరి తీసుకుపో నీ వెంట
అరి హొయ్ హొయ్ హొయ్


చంద్రుళ్ళో ఉండే కుందేలు - నువ్వొస్తానంటే నేనొద్దంటానా



చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్

చంద్రుళ్ళో ఉండే కుందేలు Lyrics:  share this song


చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా
తందానే తందానే
చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా
తందానే తందానే
నువ్వలా సాగే తోవంతా నావలా తూగే నీవెంట
ఏవంట
నువ్వెళ్ళే దారే మారిందా
నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా... ఓ...

చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా

ఏలే ఏలే ఏలో ఏలేలేలో ఏలో
ఏలేలేలో ఏలో ఏలో ఏలే ఏలేలో

హాయ్ మై నేమ్ ఈజ్ సంతోష్
యువర్ నేమ్ ప్లీజ్ - స్టెల్లా
స్టెల్లా ఓ వాటే బ్యూటిఫుల్ నేమ్
కెన్ యూ హేవ్ ఏ ఫోన్ నంబర్
రేయ్ రేయ్ రేయ్...
ఓ... కమింగ్ డాడ్

గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ...

హే గగగా రిగ రిసాస సానినిస
గగగా రిగ రిససా...

కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా
పాపలాంటి లేత పదం పాఠశాలగా
కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా
జావళీల జాణతనం బాటచూపగా
కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా
అంతటా ఎన్నో వర్ణాలు
మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా
ఇంతలా ఏవో రాగాలు

ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా
సాగుతున్న ఈ పయనం ఎంత వరకో
రేపు వైపు ముందడుగా లేని పోని దుందుడుకా
రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో
మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే
లెక్కలే మాయం అయిపోవా
రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే
దిక్కులే తత్తర పడిపోవా

అదిరే అదిరే కన్నే అదిరే - నువ్వొస్తానంటే నేనొద్దంటానా



చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: జస్సి గిఫ్ట్, కల్పన

అదిరే అదిరే Lyrics: share this song


శివశివ మూర్తివి గణనాథా
శివశివ మూర్తివి గణనాథా
శివుని కొమరుడవు గణనాథా
శివుని కొమరుడవు గణనాథా
ఛల్ సిరికి హరికీ మనువంట
ఛల్ సిరికి హరికీ మనువంట
భళరే అనరా జనమంతా
భళరే అనరా జనమంతా
హేయ్ ఘల్లుమంటు గజ్జ కట్టి
చిందు కొట్టే జగమంతా

పల్లవి:
అదిరే అదిరే కన్నే అదిరే
అదిరే అదిరే కన్నే అదిరే
కుదిరే కుదిరే అన్నీ కుదిరే
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
మొదటిసారిగా ఎదురయిందిగా
వయసు వేడుకా ఓ... ఓ...

అదిరే అదిరే కన్నే అదిరే
కుదిరే కుదిరే అన్నీ కుదిరే

చరణం1:
ఏం మాయ మెలికో కలికి ఒంటి కులుకో
నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో
ఏం నిప్పు కణికో అదేం పంటి కొరుకో
వగలువాడలో నెగడు వేస్తే నువ్ సొగసుకాడవనుకో
హెయ్ వరసై పిలిచే అందాలు
అరె మనమై చిలికే గంధాలు
అహ మనసే గెలిచే పంతాలు
అరె మనువై కలిపే బంధాలు
రణము చేయగా రమణి కోరిక అదుపు దాటగా

అదిరే అదిరే కన్నే అదిరే
ఓ కుదిరే కుదిరే అన్నీ కుదిరే

చరణం2:
పన్నీటి చినుకో పసిడిపంట జిలుగో
కాలిమెట్టెగా తాళిబొట్టుగా జంట చేరెనిదిగో
పందార తునకో పదం లేని తెలుగో
మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకెనిదిగో
హే ఎదురై రానీ మేనాలు
హో హో చెవిలో పడనీ మేళాలు
అరె అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు
మదన దీపిక మదిని మీటగ ఎదురు లేదుగా

అదిరే అదిరే కన్నే అదిరే
హే కుదిరే కుదిరే అన్నీ కుదిరే హేయ్...

ఘల్ ఘల్ - నువ్వొస్తానంటే నేనొద్దంటానా




చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు

ఘల్ ఘల్ Lyrics : share this song


పల్లవి:
ఘల్ ఘల్ ఘల్ ఘల్
ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2)

ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల
అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
పిలిపించే తడిగానం ప్రేమంటే
అణువణువును మీటె మమతల మౌనం పదపదమంటే నిలువదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
దాహంలో మునిగిన చివురుకు
చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే

ఘల్ ఘల్ ఘల్ ఘల్
ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2)

చరణం1:
ప్రాణం ఎపుడు మొదలైందో
తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో
ఎపుడు ఉదయిస్తుందో
గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసె మాటుంటే
ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
అది చరితను సైతం చదవనివైనం
కవితలు సైతం పలకని భావం
సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటె
దరిదాటి ఉరకలు వేసె ఏ నదికైనా తెలిసిందా
తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినదేదంటే
చిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా
తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే

ఘల్ ఘల్ ఘల్ ఘల్
ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2)


  1. చరణం2:

మండే కొలిమినడగందే
తెలియదే మన్నుకాదు
ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే
పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై
దరిజేరె ప్రియురాలే గెలుపంటె
తను కొలువై ఉండే విలువే ఉంటే
అలాంటి మనసుకు తనంత తానే
అడగక దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో
అడుగులు కలిపే జతవుంటే
నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతె నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా

ఘల్ ఘల్ ఘల్ ఘల్
ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2)

నిలువద్దము నిను ఎప్పుడైనా - నువ్వొస్తానంటే నేనొద్దంటానా



చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, సుమంగళి
నటీనటులు: సిద్దార్ధ, త్రిష
దర్శకత్వం: ప్రభుదేవా

నిలువద్దము నిను ఎప్పుడైనా Lyrics: share this song


పల్లవి:
నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

హే నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

చరణం1:
హా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు
నామాట విన్నట్టు నేనాపలేనంతగా
భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు
నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు
నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు

నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

చరణం2:
ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు
ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు
నీలేత పాదాలు జలపాత మయ్యేట్టుగా
నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం
మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం

హే నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

కన్నుల బాసలు తెలియవులే - 7/G బృందావన కాలనీ



చిత్రం: 7/G బృందావన కాలనీ (2004)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్
గానం: కార్తీక్

కన్నుల బాసలు తెలియవులే Lyrics : share this song


పల్లవి:
కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
ఇది అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే
ఒక పరి మగువ చూడగనే
కలిగే వ్యధతను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే
యువకుల మనసులు తెలియవులే

హే... కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే

చరణం1:
అడవిలో కాచే వెన్నెల
అనుభవించెదెవ్వరులే
కన్నులా అనుమతి పొంది
ప్రేమ చెంతకు చేరదులే
దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే
మెరుపులా వెలుగును పట్టగ
మిణుగురు పురుగుకి తెలియదులే
కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట
అల కడలి దాటగనే నురగలిక ఒడ్డుకు సొంతమట

కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగా
అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే

చరణం2:
లోకాన పడుచులు ఎందరున్నను
మనసొకరిని మాత్రమే వరియించులే
ఒక పరి దీవించ ఆశించగా
అది ప్రాణంతోనే ఆటాడులే
మంచు బిందువొచ్చి ఢీకొనగ
ఈ ముల్లె ముక్కలు అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే
అరె చీరను కట్టి స్త్రీ ఆయలే
ఉప్పెనొచ్చినా కొండ మిగులును
చెట్లు చేమలు మాయమౌనులే
నవ్వువచ్చులే ఏడుపొచ్చులే
ప్రేమలు రెండు కలసివచ్చులే
ఒక పరి మగువ చూడగనే
కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినము ఇక తపియించే
యువకుల మనసులు తెలియవులే

ఏ... కన్నుల బాసలు తెలియవులే
కన్నెల మనసులు ఎరుగములే
ఒకవైపు చూపి మరువైపు దాచగా
అద్దాల మససు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే

గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే

ఏమో ఏమౌనో -ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం



ఏమో ఏమౌనో Lyrics : share this song


చిత్రం: ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం (2001)
సంగీతం: చక్రి
సాహిత్యం: సాహితి
గానం: చక్రి

ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట
ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట
ఏది ఏమైనా హొపే మనుకుంటే
ఎంతో హేపీ కాదా ఈ లైఫంతా

లైఫ్ ధ్రిల్ డోంట్మిస్ మారియా (3)

పూచే పూగంధాలు హయి ఆనందాలు
అన్నీ ఈ లోకంలో లేవా
ప్రేమే నీలో ఉంటే భూమే చుట్టేయ్ గలవు
గువ్వై ఆ ఆకాశంలోన
తెలిసిందొకటే మనకీ లైఫ్ ఏఇఏ
కంకం అంటు వెల్కంచెప్పు ఏఇఏ
ఫలితం ఏమి ఐనాగాని చెయ్యాలోయ్ ప్రయత్నం
ఫెయిల్యూర్ సక్సస్ రెండూ కలిసిన పండేగా ఈ జీవితం

ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట
ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట

ఏదీ కష్టం కాదు ఏమీ నష్టం లేదు
లైఫ్ నే స్పోర్టివ్ గా ఫీలయితే
ఎంత ప్రోబ్లమ్ ఐనా ఎంతో సింపుల్ కాదా
లైఫ్ లో ఓ గోల్ నీకుంటే
నలుసే పడితే కళ్ళల్లోన ఏఇఏ
కళ్ళేపీకితె వైద్యం ఔన ఏఇఏ
ఫెయిలైనోళ్ళు ఫెయిలైనట్టు
ఫేర్ వెల్ చెబితె లైఫ్ కి
అందాల ఈ లోకంలోన అడ్రస్సుండదు ఎవ్వరికీ

ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట
ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట
ఏది ఏమైనా హొపే మనుకుంటే
ఎంతో హేపీ కాదా ఈ లైఫంతా

లైఫ్ ధ్రిల్ డోంట్మిస్ మారియా
లైఫ్ ధ్రిల్ డోంట్మిస్ మారియా
లైఫ్ ధ్రిల్ డోంట్మిస్...

చూపులతో దీపాల - బెంగాల్ టైగర్



చూపులతో దీపాల Lyrics: share this song


చూపులతో దీపాల
దేహముతో ధూపాల
చంపేయకే, నన్ను చంపేయకే
నవ్వులతో చెరసాల
నడుము లో మధుశాల
చంపేయకే, నన్ను చంపేయకే
హో కాలముకు అందని అక్షరమే
కవితలు తెలుపని లక్షణమే
బాపు కె  దొరకని బొమ్మ వే
బ్రహ్మ కె వన్నె తెచ్చిన
వెన్నెలమ్మ వే

ని చక్కని చిత్రానికి
కాగితాన్ని ఇచ్చుకున్న
ప్రతి కొమ్మ
ప్రతి రెమ్మ జన్మ ధన్యమే
ని చిక్కని దేహాన్ని
హత్తుకున్నా చీర రైక
నేసిన అహ చేతులది
గొప్ప పుణ్యమే
నిదురకు మెలకువ తెచ్చే
అందం నీవే లేవే
నిను మరవడం అంటే
మరణము లే

చూపులతో దీపాల
దేహముతో ధూపాల
చంపేయకే, నన్ను చంపేయకే

ఏ రుతువో ఏ రుణమో
వేళా వేళా ఏళ్ళు వీచి
ఈ తెలుగు నేలనీల
ఎంచు కుందిలే
ఆ నదులు
ఈ సుడులు
కోరి కోరి తపసు చేసి
నిపలుకు
నడకనిలా పంచుకున్నవే
ఏమిటి చంద్రుడి గొప్ప
అది నీ వెలుగెయ్ తప్ప
ఇలకే జాబిలీ వై జారవే

సందమామ - బిజినెస్ మేన్



సందమామ Lyrics: share this song

సందమామ ..
నవ్వే సందమామ
మంచు బొమ్మ
నీ మనసే ఇచ్చుకొమ్మ

సందమామ..యే..
నడిచే  సందమామ
సత్యభామ నువ్వుంటే చాలు లేమ్మా

ఓ...
కన్నుల్లో  దాచనే ..యే..
కన్నీరై జారకో    ఓహ్ ఓహ్ ఈఓ..
అల్లాడి పోతా   ఓహ్ ఓహ్ ఈఓ..
ఓ భావరి ఓ భావరి రత్తవిరవరవరా

హోయమ్మా నీ కంటిలోన
ఏ చెమ్మ రానీను నమ్మవే గుమ్మా..
నీకోసమున్నదే జన్మ

హోయామ్మా సందేహమెందుకోయమ్మ
నా గుండె కోసి చూడమ్మ
నీ బొమ్మె ఉంటదోయమ్మా...

ఓహ్ ఓహ్ ఈఓ ...
కన్నుల్లో దాచ
ఓహ్ ఓహ్ ఈఓ..

గుచ్చే బుట్ట బొమ్మ
ఊగే పూల కొమ్మ
నన్నే కట్టుకోమ్మ
చుట్టూ చుట్టుకోమ్మ

ఓ...
కలలెన్నో కన్నానే ..
కూల్చేసి వెళ్లకో...ఓహ్ ఓహ్ ఈఓ
గుండాగి పోత.. ఓహ్ ఓహ్ ఈఓ

సందమామ .. యే
నవ్వే  సందమామ
మంచు బొమ్మ
నీ మనసే ఇచ్చుకొమ్మ

సందమామ...యే..
నడిచే సందమమా
సత్యభామ నువ్వుంటే చాలు లేమ్మా

ఓహ్  కన్నుల్లో  దాచనే
కన్నీరై జారకో     ఓహ్ ఓహ్ ఈఓ..
అల్లాడి పోత  ఓహ్ ఓహ్ ఈఓ..

గుచ్చే బుట్ట బొమ్మ
ఊగే పూల కొమ్మ
నన్నే కట్టుకోమ్మ
చుట్టూ చుట్టుకోమ్మ

 సందమామ..


ఈ వేలలోన ఇంత హాయి - సినిమా చూపిస్త మావ




ఈ వేలలోన ఇంత హాయి  Lyrics: share this song


ఈ వేలలోన ఇంత హాయి
ఎందుకంటె ఏమిటంటే
చిట్టి గుండె కూడ తెలియదంది వింతగా

ఈ పిల్ల గాలి అల్లరేదో
మనసునొచ్చి గిల్లుతుంటే
నేల మీద కాలు నిలువనంది కొత్తగా
మరీ అలా అంటుంటే
మదీ ఇలా పరుగు తీసెనే..

మనసులోన హాయే
ఆ హాయిలోను మాయే
ఆ మాయలోకి లాగుతుంది అమ్మాయే

ఈ వేలలోన ఇంత హాయి
ఎందుకంటె ఏమిటంటే
చిట్టి గుండె కూడ తెలియదంది వింతగా

నీలోన కలలు నా కొంటె కనులు
ఆ చిలిపి పనులు చేసేయ్ మన్నవ్వే
నీ.. చూపు చాలు ఓ..మాట చాలు
ఒక్క చిన్న సైగ ఐన చాలన్నదే ...

లోలోపలా రమ్మన్నది
ఆ లోపలే వద్దు అన్నది

మనసులోన హాయే
ఆ హాయిలోను మాయే
ఆ మాయలోకి లాగుతుంది అమ్మాయే

ఈ వేలలోన ఇంత హాయి
ఎందుకంటె ఏమిటంటే
చిట్టి గుండె కూడ తెలియదంది వింతగా

ఆ ..జాబిలమ్మ  ఈ.. వెన్నెలమ్మ
ఓ..కొత్త జన్మ అందిస్తున్నదే
నా.. లోని ఆశ నీ.. పైన ధ్యాస
ప్రేమ భాష అక్షరాలు అవుతున్నదే ..

పదాలుగా నీ స్నేహం
పెదాలపై పలుకుతున్నది

మనసులోన హాయే
ఆ హాయిలోను మాయే
ఆ మాయలోకి లాగుతుంది అమ్మాయే



Thursday, 30 March 2017

జగ జగ జగదేక వీర - సారొచ్చారు

జగ జగ జగదేక వీర Lyrics : share this song


జగ జగ జగదేక వీర 
మగ మగ మహరాజువేర
సోగసుల సెగ రేపినావెం సుందర

జగ జగ జగదేక వీర
చక చక చక నిన్ను చేర
తికమక పడుతున్నదేదో తొందర  
 
ఒక పరి నిను చూసినాక
హ… ఒక పరి నిను చూసినాక
మనసిక తనలోన లేక
తహ తహ తలపై పొలమారుతొందిర నిదరె చెదర

జగ జగ జగదేక వీర
మగ మగ మహ రాజువేర
సొగసుల సెగ రేపినావెం సుందర

హా… మిస మిస మిస రాజహంస
మిల మిల విరహల హింస
నిగ నిగ నగరాన్నే నేడే ఏలన ...

చరణం1:
చల్లని గాలిలో చక్కిలి గింతలా
ఎక్కడ చూసిన నువ్వే    
చక్కదనాల సిరి చూసి కస్సుమన్న
ఊపిరి ఊరుకుంటుందా
రెప్పలు వాలె నీ నిప్పుల పొద్ధుల
ఎప్పుడు చూసిన నువ్వే
పువ్వుల తోటనోదిలేసి
రివ్వుమని తుమ్మెద ఎగిరిపొతుందా

హో..అటు ఇటు ముసిరావె నన్ను
హో… అటు ఇటు ముసిరావె నన్ను సులువుగ విడిపోను నిన్ను
నడుమున నలిపెయి నను ఖైదు చెసినా నిను కాదనను

జగ జగ జగదేక వీర
మగ మగ మహ రాజువేర
సొగసుల సెగ రేపినావెం సుందర


 హో… మిస మిస మిస రాజహంస
మిల మిల విరహల హింస
నిగ నిగ నగరాన్నే నేడే ఏలన ...

చరణం2:
మొగ్గను తుంచనా సిగ్గును తెంచనా
దగ్గరలోనె ఉన్నాగ
దిక్కుల కళ్ళు మూసెసి
నిగ నిగ బుగ్గలు పిండుకొమంటా
చుక్కలు దించన లెక్కలు తేల్చనా
హక్కులు అన్నీ నావెగా
చక్కేర తీపి ఎరవెసి
పెరపెర పెదవి దొచుకొమంట
చుట్టు కొలతలు చూసుకొనా
హో… చుట్టు కొలతలు చూసుకొర
పట్టుపరువము ఎలుకొర
పట్టువొదలనని నువు సాయం అదిగితె సరెలె అనన

జగ జగ జగదేక వీర
మగ మగ మహ రాజువేర
సొగసుల సెగ రేపినావెం సుందర

హో… మిస మిస మిస రాజహంస
మిల మిల విరహల హింస
నిగ నిగ నగరాన్నే నేడే ఏలన ... 

హోస్సనం - వీర


హోస్సనం Lyrics: share this song


ఓ....
హోస్సనం ఫుల్ హ్యాపీగుందే ఈ క్షణం
నువ్వు నన్నే నన్నే చూడడం
నా గుండెను పట్టుకు లాగడం..

ఓహో ....

హోస్సనం పిచ్చ హ్యాపీగుందే ఈ క్షణం
నీ మదిలో చోటే ఇవ్వడం
నాకు నేనే ముద్దొచెయ్యడం..

యాయిరె ఇదేమి హాయిరె
నాన్నేమో కూర్చోనీదు
నించోనీదు క్యా కరే

బాపురే అదోలా ఉందిలే
ఇదంతా నాలో చేరి
నువ్వు చేస్తున్న అల్లరే

మనసను అద్దంలో
కనపడుతుంటావ్
మతి చెడగొడుతుంటావ్
అమ్మడూ..

ఎటు ఎటు వెళ్తున్నా
ఎదురుగా వస్తున్నా
తికమక పెడుతుంటావ్
ఎందుకు ఎప్పుడు ...

ఓహో....

హోస్సనం పిచ్చ హ్యాపీగుందే ఈ క్షణం
నీ మదిలో చోటే ఇవ్వడం
నాకు నేనే ముద్దొచెయ్యడం... (x2)

సరి కొత్తగుందిలే
చలి గుచ్చుతుందిలే
నులి వెచ్చగుందిలే ..

మొహబ్బత్ మాయలో
మహా మత్తు ఉందిలే

నా పెదవికి పిలుపుల యోగం
నా కనులకు కల కను భాగ్యం
నిరంతరం ఈ సంబరం
నువ్విచ్చిందే కాద

నీ వెనకాలే నడిచెను పాదం
నిన్నొదిలిక నిలువదు ప్రాణం
మనస్సులో ప్రతి క్షణం
ధ్యానం నీదే కాద..

హే
నీవల్లే నీవల్లే నివల్లనే
ఈ తందనాలన్ని నివల్లనే
ఒక్కసారి చూడగానే నచ్చినావులే
గుండెలోకి దూసుకుంటు వచ్చినావులే

హే
నీవల్లే నీవల్లే నివల్లనే
జింతాక్క జింతాక్క నివల్లనే

అందాల మల్లె మొగ్గ
నా ఈడు పిల్లిమొగ్గ
వేసింది చూడు ఇంతలోనే

ఓహో....

హోస్సనం పిచ్చ హ్యాపీగుందే ఈ క్షణం
నీ మదిలో చోటే ఇవ్వడం
నాకు నేనే ముద్దొచెయ్యడం...

సరి కొత్తగుందిలే
చలి గుచ్చుతుందిలే
నులి వెచ్చగుందిలే ..

మొహబ్బత్ మాయలో
మహా మత్తు ఉందిలే

నా తనువుకి కలిగెను భారం
నా గుండెకు పెరిగెను వేగం
మనస్సుతో మనస్సుకి ఏదో
రాయబారం

మైమరపున తెలిసేను ప్రాయం
నా బిడియం చిటికెలో మాయం
వయస్సుతో వయస్సుకీ ఏంటో
రాచకార్యం

హే
నీవల్లే నీవల్లే నివల్లనే
ఈ సిత్తరాలన్నీ నివల్లనే
నువ్వు నాకు దక్కినాక
పెద్ద పండగే
మొక్కి తీర్చుకుంటా ఎక్కి ఎదుకొండలే

హే
నీవల్ల నీవల్ల నివల్లనే
నా తిక్క తైతక్క నివల్లనే
నేరేడు కళ్ళ పిల్ల
అవుతానే బొట్టు బిళ్ళ
నేనింతకంటే చెప్పలేని

ఓహో....

హోస్సనం పిచ్చ హ్యాపీగుందే ఈ క్షణం
నీ మదిలో చోటే ఇవ్వడం
నాకు నేనే ముద్దొచెయ్యడం... (x2)

అందంగా లేనా - గోదావరి


అందంగా లేనా.. Lyrics: share this song


అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా (2)

అలుసైపోయనా అసలేమి కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా

కనులు కలపవాయే మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే మాటవరసకి
కలికి చిలకనాయే కలత నిదురలాయే
మరవలేక నిన్నే మదనపడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా
నువ్వొచ్చి అడగాలి అన్నట్లు
నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా

అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా

నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడే నచ్చా
కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ
తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు
మహాతెలియనట్టు నటనలే అదీ
యెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను
తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసిపోలేదుగా

అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా (2)

అలుసైపోయనా అసలేమి కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందంగా లేనా అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా

చలి చలిగా అల్లింది - Mr.perfect


చలి చలిగా అల్లింది Lyrics: share this song


పల్లవి:
చలి చలిగా అల్లింది 
గిలి గిలిగా గిల్లింది
నీ వైపే మళ్ళింది మనసు..
చిటపట చిందేస్తుంది
అటు ఇటు దూకేస్తుంది
సతమతమైపోతుంది వయసు

చిన్నిచిన్ని చిన్నిచిన్ని ఆశలు ఏవేవో
గిచ్చిగిచ్చి గిచ్చిగిచ్చి పోతున్నాయే
చిట్టిచిట్టి చిట్టిచిట్టి ఊసులు ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే...

నువ్వు నాతోనే ఉన్నట్టు
నా నీడవయినట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరయినట్టు
నా లోపలున్నట్టు
ఏదో చెబుతునట్టు ఏవో కలలు

చలి చలిగా అల్లింది
గిలి గిలిగా గిల్లింది
నీ వైపే మళ్ళింది మనసు
చిటపట చిందేస్తుంది
అటు ఇటు దూకేస్తుంది
సతమతమయిపోతుంది వయసు

చరణం1:
గొడవలతో మొదలై
తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే నీదీ నాది
తలపులు వేరైనా కలవని తీరైనా
బలపడిపోతుందే ఉండే కొద్ది

లోయలోకి పడిపోతున్నట్టు
ఆకాశం పైకి వెళుతున్నట్టు
తారలన్నీ తారస పడినట్టు
అనిపిస్తుందే నాకు ఏమైనట్టు

నువ్వు నాతోనే ఉన్నట్టు
నా నీడవయినట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరయినట్టు
నా లోపలున్నట్టు
ఏదో చెబుతునట్టు ఏవో కలలు

చరణం2:
నీపై కోపాన్ని ఎందరి ముందైనా
బెదురు లేకుండా తెలిపే నేను
నీపై ఇష్టాన్ని నేరుగా నీకయినా
తెలపాలనుకుంటే తడబడుతున్నాను

నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే

నువ్వు నాతోనే ఉన్నట్టు
నా నీడవయినట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా ఊపిరయినట్టు
నా లోపలున్నట్టు
ఏదో చెబుతునట్టు ఏవో కలలు

ఏం సందేహం లేదు - సునీత హిట్ పాటలు



ఏం సందేహం లేదు Lyrics : share this song


ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే
ఆనందాలు పెంచింది
నిమిషము నేల మీద నిలువని గాలి లాగ
మది నిను చేరుతోందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది
హృదయము రాసుకున్న లేఖా.ఆఅ..

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది

వెన్నెల్లో ఉన్నా.. వెచ్చంగా ఉంది..
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా.. ఏదోలా ఉంది..
నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి
ఓ ముగ్గేసి వెళ్లావే
నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు
మది నిను చేరుతుందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖా..ఆఅ..

వెన్నెల్లో ఉన్నా.. వెచ్చంగా ఉంది..
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా.. ఏదోలా ఉంది..
నువ్వే గుర్తొస్తుంటే

నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి
కూ అంటూంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు
పూయిస్తే చాలన్నావా
ఏమౌతున్నా గానీ ఏమైనా ఐపోనీ
ఏం ఫరవాలేదన్నావా

అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక
సతమతమైన గుండె గనుక
అడిగిన దానికింక బదులిక పంపుతుంది
పదములు లేని మౌన లేఖా..ఆఆ...
మ్.. మ్.. మ్.. మ్.. మ్.. మ్..

నాదిరిదీన నాదిరిదీన -ఒకరికి ఒకరు



నాదిరిదీన Lyrics : share this song


నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నచ్చినదాని కోసం నా తపన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
విచ్చిన పూల సందేశం విననా
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నచ్చినదాని కోసం నా తపన
సీతకొక చిలుక రెక్కల్లోన ఉలికే
వర్ణాలన్ని చిలికి హొలి ఆడనా
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన

నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన నా
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నచ్చినదాని కోసం నా తపన

చిగురే పెదవై చినుకే మధువై
ప్రతి లతలో ప్రతిబింబించే
నదులే నడకై అలలే పలుకై
ప్రతి దిశలో ప్రతిధ్వనియించే
ఎవరి కలో ఈ లలన
ఏ కవిదో ఈ రచన

నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన నా
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నచ్చినదాని కోసం నా తపన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
విచ్చిన పూల సందేశం విననా

కురిసే జడిలో ముసిరే చలిలో
ప్రతి అణువు కవితలు పాడె
కలిసే శృతిలో నిలిచే స్మృతిలో
ప్రతి క్షణము శాశ్వతమాయే
ఈ వెలుగే నీ వలన
నీ చెలిమే నిజమననా

నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన
నాదిరిదీన నాదిరిదీన నాదిరిదీన నా

నీ జతగా నేనుండాలి -ఎవడు



నీ జతగా నేనుండాలి.. Lyrics: share this song


నీ జతగా నేనుండాలి..
నీ ఎదలో నేనిండాలి..
నీ కథగా నేనే మారాలి..

నీ నీడై నేనడవాలి..
నీ నిజమై నేనిలవాలి..
నీ ఊపిరి నేనే కావాలీ..

నాకే తెలియని నను చూపించి..
నీకై పుట్టాననిపించి..
నీదాకా నను రప్పించావే..

నీ సంతోషం నాకందించి..
నా పేరుకి అర్ధం మార్చీ..
నేనంటే నువ్వనిపించావే..


నీ జతగా నేనుండాలి..
నీ ఎదలో నేనిండాలి..
నీ కథగా నేనే మారాలి..

నీ నీడై నేనడవాలి..
నీ నిజమై నేనిలవాలి..
నీ ఊపిరి నేనే కావాలీ..


కల్లోకొస్తావనుకున్నా..
తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా..

రాలేదే ? జాడైనా లేదే ?

రెప్పల బైటే నేనున్నా..
అవి మూస్తే వద్దామనుకున్నా..

పడుకోవే ? పైగా తిడతావే ?

లొకంలో లేనట్టె..
మైకం లో నేనుంటే..
వదిలేస్తావ నన్నిలా..

నీ లోకం నాకంటె..
ఇంకేందో వుందంటే..
నమ్మే మాటలా

నీ జతగా నేనుండాలి..
నీ ఎదలో నేనిండాలి..
నీ కథగా నేనే మారాలి..

నీ నీడై నేనడవాలి..
నీ నిజమై నేనిలవాలి..
నీ ఊపిరి నేనే కావాలీ..


తెలిసీ తెలియక వాలిందీ..
నీ నడుమొంపుల్లో నలిగిందీ
నా చూపూ.. ఏం చేస్తాం చెప్పూ..

తోచని తొందర పుడుతోంది..
తెగ తుంటరిగా నను నెడుతోందీ
నీ వైపూ.. నీదే ఆ తప్పూ

నువ్వంటే నువ్వంటూ..
 ఏవేవో అనుకుంటూ..
విడిగా ఉండలేముగా

దూరంగా పొమ్మంటూ..
దూరాన్నే తరిమేస్తూ..
ఒకటవ్వాలిగా

నీ జతగా నేనుండాలి..
నీ ఎదలో నేనిండాలి..
నీ కథగా నేనే మారాలి..

నీ నీడై నేనడవాలి..
నీ నిజమై నేనిలవాలి..
నీ ఊపిరి నేనే కావాలీ..

ఎలా ఎలా - పంజా



ఎలా ఎలా Lyrics: share this song


ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా

నిన్నలోని నిమిషమైన గురుతు రాదే ఈక్షణం
నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లెదేలా
నా భాషలోన తీయ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసి పాపలాగా నవ్వే గుణం
నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలోనే చేరాలని
నూరేళ్ళ పయనాలు చేయాలని
ఈ పరవశం లోన నిలిచా ప్రాణ శిలలా

ఎలా ఎలా ఎలా ఎలా
నాలో కళా చూపేదేలా
ఎడారిలో గోదారిలా
నాలో అలా ఆపేదెలా
ఈ మాయని నమ్మేది ఎలా
ఈ మాటని చెప్పేదెలా
నీ పరిచయం లోన పొందా జన్మ మరలా

I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart

Wednesday, 29 March 2017

సంతోషం సగం బలం - చిరునవ్వుతో


సంతోషం సగం బలం Lyrics : share this song


సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా

చుట్టమల్లే కష్టమొస్తే కళ్లనీళ్లు పెట్టుకుంటూ
కాళ్లు కడిగి స్వాగతించకూ
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేనిపోని సేవచేయకు
మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా
ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా

నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!

ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా

నిన్న రాత్రి పీడకల నేడు తలచుకుంటూ
నిద్రమానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ
లేవకుండా ఉండగలమా
కలలుగన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలీ!
నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళీ!

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!
ఆ సంగీతం నీ తోడై సాగవె గువ్వమ్మా!

మేఘాలు లేకున్నా - కుమారి 21F



మేఘాలు లేకున్నా... Lyrics share this song


మేఘాలు లేకున్నా
నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా
నే తేలిపొతున్న
ఈ మాయలన్ని నీ వల్లేనా

వెళ్ళె దారిలొ లేడె చంద్రుడే
ఐనా వెన్నెలే అది నీ అల్లరేనా
చెట్టు నీడనైనా లేనే పైన పూల వాన            |మేఘాలు|


కోపముంటె నేరుగా చూపకుండా ఇలా..
 రాతిరంత నిద్దురె పాడుచేస్తె ఎలా
నేరముంటె సూటిగ చెప్పకుండా ఇలా..
మేలుకున్న కలలతో వేస్తావుగా సంకెల

పూట పూట పొలమారుతుంటె అసలింత జాలి లేదా..
నేను కాక మరి నేల మీద తలిచేటి పేరు లేదా..
క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసుపోదా        |మేఘాలు|

మాటలోన లేదుగ ముద్దు చెప్పే నిజం
చూపులోన లేదుగ స్పర్శ చెప్పే నిజం
సైగలోన లేదుగ గిల్లి చెప్పె నిజం
నవ్వుకన్నా నాకిల నీ పంటి గాటే నిజం

కింద మీద పడి రాసుకున్న పది కాగితాల కవిత ఎంతకైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుటా
మన మధ్య దారం కైన దారి ఎందుకంట     |మేఘాలు|

నీలి రంగు చీరలోన - గోవిందుడు అందరివాడేలే

నీలి రంగు చిరలోన Lyrics: share this song


నీలి రంగు చీరలోన
సందమామ నీవే జాణ
ఎట్ట నిన్ను అందుకోనే
ఏడు రంగుల్లున్న నడుము
బొంగరంలా తిప్పేదానా
నిన్ను ఎట్టా అదుముకోనే
ముద్దులిచ్చి మురిపిస్తావే
కౌగిలించి కవ్విస్తావే
అంతలోనే జారిపోతావే

మెరుపల్లె మెరిసి జాణ
వరదల్లె ముంచె జాణా
ఈ భూమి పైన నీ మాయలోన
పడనోడు ఎవడె జాణా

జాణ అంటే జీవితం
జీవితమే నెరజాణరా
దానితో సయ్యాడరా
యేటికి ఎదురీదరా

రాక రాక నీకై వచ్చి
పొన్నమంటి చిన్నది ఇచ్చే
కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో
పూవు లాగ ఎదురే వచ్చి
ముల్లులాగ ఎదలో గుచ్చి
మాయమయే భామ వంటిదె కష్టమనుకో

ఎదీ కడదాక రాదని
తెలుపుతుంది నీ జీవితం
నీతో నువు అతిథివనుకొని
వెయ్ రా అడుగేయ్ రా వెయ్
జాణ కాని జాణరా జీవితమే నెరజాణరా
జీవితం ఒక వింత రా
ఆడుకుంటె పూబంతిరా

సాహసాన పొలమే దున్ని
పంట తీసె బలమే ఉంటే
ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుందిలా
బతుకు పోరు బరిలో నిలిచి నీకు నీవె ఆయుధమైతే
ప్రతి పూట విజయ దశమియే వస్తుందిరా
నీపై విధి విసిరె నిప్పుతో ఆడుకుంటె దీపావళి
చెయ్ రా ప్రతి ఘడియ పండగే చెయ్ రా చెయ్ రా చెయ్

జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా
జీవితం ఒక జాతర చెయ్యడానికే జన్మరా


ఏదోలా ఉందే నువ్వే లేక - నేనింతే


ఏదోలా ఉందే నువ్వే లేక Lyrics: share this song



oh no no noo no no no..(2)

ఏదోలా ఉందే నువ్వే లేక...
ఏమీ బాలేదె నువ్వెళ్ళాక..
ఏంచేయ్యాలో పాలుపోక..
ఉన్నా నీ కల్లో నిదర్రాక...

oh no no noo no no no..
నువ్వె నా సంతోషం.
గిల్లావే నా ప్రాణం
i miss u.. i miss u.. i miss u the darling dear.(2)

ఏదోలా ఉందే నువ్వే లేక...
ఏమీ బాలేదె నువ్వెళ్ళాక..
ఏంచేయ్యాలో పాలుపోక..
ఉన్నా నీ కల్లో నిదర్రాక...

మిల మిల మిల మిల మెరుపుల తార..
కళలకు కళ కళ చిలికిన తార..
తళ తళ తళ తళ తళుకుల తార..
గల గల నగవుల చిలిపి సితార...
ప్రేమంటె ఎందుకంటే కారణాలె లేవంటా..
నా కంటె ఇష్టమంట నువ్వంటా..
నా కంటె ముందె ఉంటే చాలనుకున్నా..
నువ్వు దూరమైతే ఏదో అయిపొతున్నా..

oh no no noo no no no
నువ్వె నా సంతోషం.
గిల్లావే నా ప్రాణం
i miss u.. i miss u.. i miss u the darling dear..(2)

ఏదోలా ఉందే నువ్వే లేక...
ఏమీ బాలేదె నువ్వెళ్ళాక..
ఏంచేయ్యాలో పాలుపోక..
ఉన్నా నీ కల్లో నిదర్రాక...

నిగ నిగ సొగసులు కురిసిన తార..
చనువుగ మనసును తడిపిన తార..
తలపుల తలుపులు కదిపిన తార..
ఎద సెగ పలికిన వలపు సితార..
తేదీలే మారుతున్నా నిన్నల్లోనే ఉన్నానే..
మనసంతా నింపుకున్నా నీతోనే..
నువ్వు డూరమయ్యే మాటెంతో చేదైనా..
ఓ నింగి తార నువ్వుండాలే పైనా...

oh no no noo no no no
నువ్వె నా సంతోషం.
గిల్లావే నా ప్రాణం
i miss u.. i miss u.. i miss u the darling dear..(2)

ఏదోలా ఉందే నువ్వే లేక...
ఏమీ బాలేదె నువ్వెళ్ళాక..
ఏంచేయ్యాలో పాలుపోక..
ఉన్నా నీ కల్లో నిదర్రాక...

oh no no noo no no no(2) 

నీతోనే డాన్స్ టు నైట్ - ధ్రువ


నీతోనే డాన్స్ టు నైట్ Lyrics: share this song




సునో సునో సునో సున్లో యారో లవ్ సోల్జర్
సునో సునో సునొ సున్ మేరీ స్పైసీ కభర్
అనువనువునా పొగించావోయ్ ప్రేమ రివర్
గన గన గన మోగించావోయ్ ప్యారు బజ్జర్

నీతోనే డాన్స్ టు నైట్
నీతోనే డాన్స్ ఫుల్ లైఫ్
నీతోనే బాడీ పుల్లదా ..

వన్ మోర్ టైం

నీతోనే డాన్స్ టు నైట్
నీతోనే డాన్స్ ఫుల్ లైఫ్
నీతోనే బాడీ పుల్లదా      (x3)


తూ ఏక్ మే ఏక్ చేరిన వేల
దో దిల్ దో దిల్ చేసెను గోల
తీన్ బార్ తీన్ బార్ తుంటరీ గోల
జాక్ పాట్ చేయ్యేలా..

పాడీ ఇదీ ప్రేమలా పాడీ
జోడీ నువ్వు నేనొక జోడీ
ఆడీ పాడేద్దాం మేలేడీ

వన్ మోర్ టైం

పాడీ ఇదీ ప్రేమలా పాడీ
జోడీ నువ్వు నేనొక జోడీ
ఆడీ పాడేద్దాం  మేలేడీ

నీతోనే  డాన్స్ టు నైట్
నీతోనే డాన్స్ ఫుల్ లైఫ్
నీతోనే బాడీ పుల్లదా

వన్ మోర్ టైం

నీతోనే డాన్స్ టు నైట్
నీతోనే డాన్స్ ఫుల్ లైఫ్
నీతోనే బాడీ పుల్లదా  (x3)

పూలనే కునుకేయమంటా -ఐ మనోహరుడు


పులానే కునుకేయమంటా Lyrics: share this song


పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
హే ఐ అంటే మరి నేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా

అసలిపుడు నీకన్న ఘనుడు లోకాన కనబడునా మనిషై
అదిజరగదని ఇలా అడుగువేసినా నిను వలచిన మనసై
ప్రతి క్షణము క్షణము నీ అణువుఅణువులను కలగన్నది నా ఐ
ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై
నా చేతిని వీడని గీత నువ్వై నా గొంతుని వీడని పేరువి నువ్వై
తడిపెదవుల తళుకవనా నవ్వు నవ్వనా ఎంత మధురం

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా

నీరల్లే జారేవాడే నాకోసం ఒక ఓడయ్యడా
నీడంటు చూడనివాడే నన్నే దాచిన మేడయ్యడా
నాలోన వుండే వేరొక నన్నే నాకే చూపించిందా
నారాతి గుండెని తాకుతు శిల్పంగా మార్చేసిందా
యుగములకైనా మగనిగ వీణ్ణే పొగడాలి
అంటూ ఉంది నాలో మనసివ్వాళే
ప్రతి ఉదయానా తన వదనాన్నే
నయనము చూసేలాగా వరమేదైనా కావాలే

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా
హే ఐ అంటే మరినేనను అర్ధము తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా
హయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా... తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా... తనువచ్చెనంటా

Tuesday, 28 March 2017

Next ఏంటి..? -నేను లోకల్


నెక్స్ట్ ఏంటి..? Lyrics: share this song


బి.ఏ పాసైనా.. అరె ఎం.ఏ పాసైనా
బి.టెక్ పాసైనా.. మరి ఎం.టెక్ పాసైనా
కంగ్రాట్స్ అయ్యో.. సూపర్ భయ్యో
అనడం మానేసి
మనకే తెలియని ఫ్యూచర్ గురించి
ఫూలిష్ ప్రశ్నేంటీ .?
నెక్స్ట్ ఏంటి ..? అంటూ గోలేంటి..?

ఇంట్లో నాన్నైనా
వంటింట్లో అమ్మైనా
పేపర్ బాయ్ అయినా
ఫేసుబుక్ లో ఫ్రెండ్ అయినా
పరీక్షల్లాన్ని చించేశావని
ప్రెయిజింగ్ మానేసి
అరె వచ్చిన మార్కులు మరిచేలా
ఈ క్వశ్ఛన్ మార్కేంటి
నెక్స్ట్ ఏంటి ..?
అంటూ గోలేంటి..?

కోదాడ తర్వాత బెజవాడ వస్తుందంటే
ఈ కోర్సే పూర్తయ్యాక
నెక్స్ట్ ఏంటో ఎం చెబుతాం
ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్సే ఊహించేస్తాం
ఇంజనీరింగ్ అయ్యిపోయాక
నెక్స్ట్ ఏంటని ఎట్టా ఊహిస్తాం

బల్బ్ ను చేసే టైం లో
ఎడిసన్ గారిని కలిసేసి
నెక్స్ట్ ఏంటంటే పారిపోడా
బల్బ్ ని వదిలేసి
అరె అంతటోళ్ళకే ఆన్సర్ తెలియని
ప్రశ్నను తెచ్చేసి
ఇట్టా మా మీద రుద్దేస్తే
మా ఈ బ్రతుకుల గతి ఏంటి

నెక్స్ట్ ఏంటి..? ఈ గోలేంటి..?

ప్యారులో పడిపోయాక
బ్రేకప్పో పెళ్ళో ఖాయం
ఈ పట్టా చేపట్టాక
నెక్స్ట్ ఏంటో ఏమంటాం
సిల్వర్ మెడలొచ్చాక
గోల్డ్ మెడలే ఆశిస్తుంటాం
ఈ డిగ్రీ దొరికేసాక
నెక్స్ట్ ఏంటని చెప్పడం ఎవడి తరం

బ్రాండెడ్ బట్టల కోసం
డబ్బులు ఇవ్వాలా ఏంటి ..?
బీరు బిర్యానీకై
చిల్లర కావాలా ఏంటి..?
ఇట్టా పనికొచ్చేటి
ప్రశ్నలు అస్సలు అడగరు మీరేంటి..?
పైగా నెక్స్ట్ ఏంటంటూ చెయ్యని తప్పుకు
మాకీ శిక్షఏంటి

నెక్స్ట్ ఏంటి అంటా
ఈ గోలేంటి అంటా

నెక్స్ట్ ఏంటీ.. ఏయ్..
నెక్స్ట్ ఏంటీ.. అబ్బా..
హుర్ర్.ర్ర్.ర్రా..

ఒక ప్రాణం -బహుబలి 2


ఒక ప్రాణం .. Lyrics: share


ఒక ప్రాణం  ఒక త్యాగం
తెలిపిందా .. ఓ... తన గమ్యం

ఒక పాశం తన నిష్టయ్
రగిలిందా ...ఓ...రణ తంత్రం
హణనంతోనే మొదలయ్యిందా
హవనంలో జ్వలనం సేభాసనే నభం

రారా రమ్మని రారా రమ్మని
పిలిచిందా  రాజ్యం
వరించగా జయం శాంతం

బలితానై ఉలితానై  మాలిచేనా...ఓ....
భవితవ్యం రుధిరంలో రుణబంధం
ప్రతి బొట్టూ.... శైవం ....శివం...

దండాలయ్యా దండాలయ్యా - బహుబలి 2


దండాలయ్యా...దండాలయ్యా..Lyrics:  share this song

పడమర కొండల్లో
వాలిన సూరీడ
పగిలిన కోటలనే
వదిలిన మారేడ (x2)


తడిసిన కన్నుల్లో ...
మళ్ళీ ఉదయించి
కలలో దేవుడిలా
కాపై ఉంటావ
నీ అడుగులకే మడుగులకే ఒత్తే వాళ్ళం నువ్వంటే  ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా..

దండాలయ్యా...దండాలయ్యా ...
మాతోనే నువ్వుండాలయ్యా
దండాలయ్యా...దండాలయ్యా ...
మాతోనే నువ్వుండాలయ్యా

తమనేలే రాజును మోసే
భాగ్యం కలిగినదనుకుంటూ
ఈ బండల గుండెలు పొంగి
పండగ ఐపోదా
తాను చిందించే
చెమటను తడిసే
పుణ్యం దొరికిందనుకుంటూ
పులకించిన ఈ నేలంతా
పచ్చగా ఐపోదా...

నీమాటే మా మాటయ్యా..
నీ చూపే శాసనమయ్యా
మా రాజు నువ్వే తండ్రీ నువ్వే కొడుకే నువ్వే
మా ఆయువు కూడ నీదయ్యా..

దండాలయ్యా...దండాలయ్యా ...
మా రాజై నువ్వుండాలయ్యా
దండాలయ్యా...దండాలయ్యా ...
మా రాజై నువ్వుండాలయ్యా


Monday, 27 March 2017

కన్నా నిదురించురా -బాహుబలి 2


కన్నా నిదురించురా Lyrics: share this song


మురిపాల ముకుందా
సరదాల సనందా (x3)

పొద పొదలోన
దాగుడు మూతలాపర
ఎద ఎదలోన
నర్థించింది చాలుర
అలసట నిను కోరి నిలుచుందిరా

కన్నా నిదురించురా
నా కన్నా నిదురించురా
చిటికెన వేలుని
కొండను మోసిన
కన్నా నిదురించురా
నా కన్నా నిదురించురా
చిలికిన చల్లలా
కొండలు దోచిన

కన్నా నిదురించురా
నా కన్నా నిదురించురా(x2)


గోపెల వలువలతో
చెలగి అలసేవేమో
గోముగ సయనించు
ఉంగిలి వెన్నెలకై
ఉరికే ఉబలాటముకే
ఊరట కలిగించు
శ్యా...మనా మో...హన
చాలు చాలు నీ అటమటలు
పవలించక తీరవు
అలసటలు విరిసే మదిలో విరిసెయ్యలు

కన్నా నిదురించురా
నా కన్నా నిదురించురా(x2)

నెర నెర చూపులకే
కరిగి కదిలి నీకై
బిర బిర వచ్చితినే
తడి తడి కన్నులతో
నీపై వాలి సోలి
తమకము తెలిపితినే
మా..ధవా యా...దవా
నా మతి మాలి
దోషము జరిగే
ఓ వనామాలి ఎద్దు
నిన్ను పొడిచే
పాపం అంత నాదేనురా

కన్నా నిదురించురా
నా కన్నా నిదురించురా(x2)


మురిపాల ముకుందా
సరదాల సనందా (x2)

మధన మధుసూధనా
మనోహర మన్మోహనా(x2)

మురిపాల ముకుందా
సరదాల సనందా
ఆనంద అనిరుద్దా
ఆనంద అనిరుద్దా

కన్నా కన్నా కన్నా
కృష్ణా రాధా రమణా
కన్నా నిదురించురా...

హంస నావ - బాహుబలి-2




ఒరోరి రాజా
వీరాది వీర
ఒరోరి రాజా
వీరాది వీర
నీతోనే నేను ఉండిపోన
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్న
అందాక నేను కూడా రానా

హాయైన హంస నావలోన
నీ గాలి సోకుతుంటే పైనా
మెచ్చిందిలే దేవసేన

నిన్నే ఎదపై
విశాల వీర భూమిపై వసించనా
నేనె వలపై
వరాల మల్లికై వాలన
నీలో రగిలే
పరాక్రమ జ్వాలనై హసించనా

నిన్నే గెలిచే
సుఖాల ఖేలిలో తేలనా

ఓహో హో .... ఓహో హో....
ఏకాంత కాంత మందిరానా
ఓహో హో.... ఓహో హో....
నీ మోహ బహు బంధనాన
నూరేళ్ళ బంధిని కానా

ఒరోరి రాజా
వీరాది వీర
ఒరోరి రాజా
వీరాది వీర
నీతోనే నేను ఉండిపోన
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్న
అందాక నేను కూడా రానా

హాయైన హంస నావలోన
నీ గాలి సోకుతుంటే పైనా
మెచ్చిందిలే దేవసేన

సాహోరె బాహుబలి -బహుబలి2

సాహోరె బాహుబలి Lyrics : share this song


భలి భలి భలిరా భలి
సాహోరె బాహుబలి

భలి భలి భలిరా భలి
సాహోరె బాహుబలి
జయహారతి నికే పట్టాలి... పట్టాలి

భువణాలన్నీ  జై కొట్టాలి
గగణాలే ఛత్రం పట్టాలి..

హెస్స రుద్రస్స
హెసరభద్ర సముద్రస్స (x4)

ఆ జనని దీక్షా అచలం
ఈ కొడుకే కవచం
ఇప్పుడా అమ్మకి  అమ్మవైనందుక
పులకరించిందిగా ఈ క్షణం

అడవులు గుట్టల్ మిట్టల్ గమనించు
పిడికిట పిడుగుల్ పట్టి మించు
అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు
అవనికి స్వర్గాలే దించు

అంత మహా బలుడైనా
అమ్మ ఓడి పసివాడే
శివుడైన భవుడైనా
అమ్మకి సాటి కాదంటాడే

హెస్స రుద్రస్స
హెసరభద్ర సముద్రస్స (x2)

హెస్స రుద్రస్స
హెస్స రుద్రస్స
హెసరభద్ర సముద్రస్స
హెసరభద్ర సముద్రస్స

హెస్స రుద్రస్స
హెసరభద్ర సముద్రస్స (x5)

భలి భలి భలిరా భలి
సాహోరె బాహుబలి
జయహారతి నికే పట్టాలి... పట్టాలి (x2)

భువణాలన్నీ  జై కొట్టాలి
గగణాలే ఛత్రం పట్టాలి..



ధీవర- బహుబలి



ధీవర Lyrics: share this song


హు నన హూన్నన హూన్నన హూన్నన నచ్చానా
హు నన హూన్నన హూన్నన హూన్నన అంతగానా
అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా
అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా ...

ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర

అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలించనా
అడుగునై నడుపనా నీజంట పయనించనా
పడి పడి తల పడి వడి వడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా
సిగముడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని జటాఝూటంలా
ఢీకొని సవాలని తెగించి నీవైపు దూసుకొస్తున్నా
ఉగ్రమ అసమ శౌర్య భావ రౌద్రమ నవ  భీతిర్మా
ఉగ్రమ అసమ శౌర్య భావ రౌద్రమ నవ  భీతిర్మా

నిలువనా ఎదుగరా నిను రమ్మంది నా తొందరా
కదలికే కదనమై గగనాకెదురీదరా
విజితరిపు రుధిరధార కలిత అసిధర కఠోర
కుల కుధర తిలిత గంభీర జయ విరాట్ వీరా
విలయ గగన తల భీకరా గర్జత్ ధారాధరా
హృదయ రసకాసారా విజిత మధు పారావార

భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి
భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి
భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి
భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి

ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర

ధీవర ధీవర ప్రసర శౌర్య ధార
దరికి చేరరార ఉత్సర సుందర స్థిర గంభీర చెలి నీదేరా

Movie    :  Bahubali
Lyrics    :  Ramajogayya Sastry, Shiva Shakthi Datta
Music    :  M M Keeravani
Singers :  Remya Behara, Deepu



Sunday, 26 March 2017

సోగ్గాడే చిన్ని నాయన title song -- సోగ్గాడే చిన్ని నాయన



సోగ్గాడే చిన్ని నాయన Lyrics: share this song


పల్లవి:
అరె చెక్కెరకెళి చిన్నోడే
చుక్కలు చూపే చందురుడే
సుర్రుమంటు వచ్చాడొచ్చాడే ..
హే గంధము గట్రా పూయండే
బిందెలు సిద్ధం చేయండే
ఉన్నదంతా పట్టించేయండే ..

కట్ట కట్టి అందాలన్నీ
నా మీదకి వస్తుంటే
పట్టి పట్టి నన్నే చూసి ఇట్టా కవ్విస్తూ ఉంటె
ఎట్టా తప్పుకుంటా సెప్పండే..

సోగ్గాడే చిన్ని నాయన
ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయన
సిగ్గులేక్క  ఎట్టినాడు సోగ్గాడు సోగ్గాడు ..

చరణం1:
చూపు కలిపాడంటే మనసు దోచేస్తాడే
మాట కలిపాడంటే మౌల్డ్ ని చేసేస్తాడే
అరెరెరే...అయ్యో ఆవలించామ ఆస లెక్కెడతాడే..
మంచోడమ్మ మంచోడనుకుంటే
అడ్డెడ్డెడ్డె ...మంచాలెక్కి మల్లెలు చల్లాడే

అద్దిరబన్న అప్సరలంతా వెంట వెంట పడుతూవుంటే
దుడుకెట్ట దాక్కుంటాదే ...యే యే యే యే...
సోగ్గాడే సోగ్గాడే  సోగ్గాడే
సోగ్గాడే సోగ్గాడే సోగ్గాడే..

సోగ్గాడే చిన్ని నాయన
ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయన
ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు

చరణం2:
జిల్లా మొత్తం మీద ఇలాంటోడు లేడే
పిల్లాడప్పటినుండి పిల్లనగ్రోవూదాడే
నవ్వే కవ్వం చేసి ప్రాణం చిలికేత్తాడే
అణ్యం పుణ్యం తెలిదనుకుంటే
అడ్డెడ్డెడ్డె...అన్నీ అన్నీ చేసేస్తున్నాడే
ఒప్పుల కుప్ప ఒంపుల తిప్ప
సోకుల దెబ్భ ముద్దుల డబ్బా
నాకేం తెలుసే ఇది తప్పా ...హే హే హే..

సోగ్గాడే చిన్ని నాయన
ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు
సోగ్గాడే చిన్ని నాయన
ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగ్గాడు

Saturday, 25 March 2017

కాటుక కళ్లను చూస్తే - మిర్చి


పల్లవి:
కాటుక కళ్లను చూస్తే
పోతుందే మతి పోతుందే
చాటుగ నడుమును చూస్తే
పోతుందే మతి పోతుందే
ఘాటుగ పెదవులు చూస్తే
పోతుందే మతి పోతుందే
లాటుగ సొగసులు చూస్తే
పోతుందే మతి పోతుందే
లేటుగ ఇంతందాన్ని చూశానే అనిపిస్తుందే
నా మనసే నీవైపొస్తుందే

ఇదేదో బాగుందే చెలీ ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే చెలీ ఇదేనా ప్రేమంటే మరి

నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుందే
ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుందే
నిన్నిల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే
అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే
నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో
అనుకుంటూనే
ఇలాగే ఇంకాస్సేపంటోంది

ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

చరణం1:
తెలుసుకుంటావా తెలుపమంటావా
మనసు అంచుల్లో నించున్న నా కలని
ఎదురు చూస్తున్నా ఎదుటనే ఉన్నా
బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని
వేల గొంతుల్లోన మోగిందే మౌనం
నువ్వున్న చోటే నేనని
చూసీ చూడంగానే చెప్పింది ప్రాణం
నేన్నీదాన్నైపోయానని

ఇదేదో బాగుందే చెలీ ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి

చరణం2:
తరచి చూస్తూనే తరగదంటున్నా
తళుకు వర్ణాల నీ మేను పూల గని
నలిగిపోతూనే వెలిగిపోతున్నా
తనివితీరేట్టు సంధించు చూపులన్నీ
కంటి రెప్పలు రెండూ పెదవుల్లా మారి
నిన్నే తినేస్తామన్నాయే
నేడో రేపో అది తప్పదుగా మరి
నీకోసం ఏదైనా సరే

ఇదేదో బాగుందే చెలీ ఇదేనా ప్రేమంటే మరి
ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి...

ఉసురే పోయెనే -విలన్


ఉసురే పోయెనే.. Lyrics : share this song


ఈ భూమిలోన ఎప్పుడంట నీ పుటక..
నా బుద్ధిలోన నువ్వు చిచ్చు పెట్టాక..
ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా..
ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనా..

ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా
ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనా..
ఈ చిన్న అగ్గిపుల్ల బగ్గుమంటే ఇంకా
ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వదా..

ఉసురే పోయెనే ఉసురు పోయెనే
కదిలే పెదవులు చూడగనే..
ఓ ప్రేమకు తపించి వేడుతువున్నా..
మనసును ఇవ్వవే మగనాలా..

అందని తీరాన నీవున్నా..
హత్తుకుపోవే దరిచేరి
అగ్గిపండు నువ్వని తెలిసి
అడుగుతువున్నా ఉడుకు రుచి
ఒంటికి మనస్సుకు ఆమడ దూరం
కలిపేదెట్టా తెలియదుగా
మనసే చెప్పే మంచి సలహా.. మాయ శరీరం వినదు కదా..
తపనే తొలిచే నా పరువము బరువు కదా..
చిలిపి చిలకే మరి నను గని కులికె కదా
ఈ మన్మధ తాపం తీరునా
ఈ పూనకాల కోడి పెట్ట తీర్చునా
ఈ మాయదారి పిచ్చి తీర్చి మన్నించెనా
చంద్రుడు సూరీడు చుట్టి ఒక్కచోట చేరిపోయే
సత్యం అసత్యము నేడు చీకటింటి నీడలాయె

ఉసురే పోయెనే ఉసురే పోయెనే కదిలే పెదవులు చూడగనే..
ఓ.. ప్రేమకు తపించి వేడుతువున్నా మనసును ఇవ్వవే మగనాలా..
అందని తీరాన నీవున్నా హత్తుకుపోవే దరిచేరి
అగ్గిపండునువ్వని తెలిసి
అడుగుతు వున్నా ఉడుకు రుచి....

ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి
తను కాచుకోదు కళ్ళులేని కట్టడిది
మనం చట్టమంటూ గీసుకున్న గిరి ఇది
దాని బొక్కలెన్నో లెక్కపెట్టి చూడు మరి

మబ్బులు విడిచిన సూర్యుని చూసి మొగ్గలు విచ్చును తామర
దూరం భారం చూడనిదొకటే నీకు పుట్టిన ప్రేమ రా..
పామా వేరా అన్న తేడా తెలియదు లే
పామే అయినా ఇక వెనకడుగుండదులే
చితి మంటలు రేగిన వేళలో
నా కన్నుల చల్లని నీ రూపే
నే మట్టికలిసిన మదిలో నీవే
చందురుడు సూరీడు చుట్టి ఒకచోట చేరిపోయే
సత్యమసత్యము నేడు చీకటింటి నీడలాయె
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
కదిలే పెదవులు చూడగనే
ఓ.. ప్రేమకు తపించి వేడుతువున్నా
మనసును ఇవ్వవే మగనాలా..
అందని తీరాన నీవున్నా
హత్తుకుపోవే దరిచేరి
అగ్గిపండు నువ్వని తెలిసి
అడుగుతు వున్నా ఉడుకు రుచి

విలన్
గానం : కార్తీక్
సాహిత్యం : వేటూరి
సంగీతం : AR రెహమాన్

Sada ninnu song lyrics-Mahanati