పల్లవి:
కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే
కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమ
పసి చిలక పసి చిలక నే కలలే కన్నానే
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే చేరానే
చరణం1:
కడలై పొంగిన మాటలు అన్నీ ముత్యపు చినుకులై రాలె
మౌనం మింగిన మాటలు మాత్రం మది విడవే
దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం
దూరం భారం కాలం అన్నీ దిగదుడుపే
ఎదలోకి ప్రేమొస్తే కమ్మేను కలవరమే
మిన్నేటి మెరుపల్లె విహరిస్తాను క్షణమే
చరణం2
ఆశే చిన్న తామరముల్లై వెచ్చని గుండెని పొడిచే
మౌనం కొంచెం బలపడి మళ్లీ ఉసిగొలిపే
అయ్యో భూమి నన్నే విడిచి తనకై చుట్టూ వెతికే
అయినాగాని ఎదలో ఏదో ఒక మైకం
ఇది ప్రేమ తొలి మలుపా జగమైన చెలి తలపా
ఒక మోహం ఒక పాశం కుదిపేసే కధ మధురం......
Movie :: Veedokkade [2009]
Cast :: Surya, Tamanna
Music :: Harris Jairaj
Director :: KV Anand
No comments:
Post a Comment