రా రాకుమారా... Lyrics : share this song
పల్లవి:
రా రాకుమారా రాజసాన ఏలగాయెదపై చేరనీరా పూలమాలే నేనుగా
నీవు తీసే శ్వాసలో ఊయలూగే ఆశతో
పంపుతున్నా నా ప్రాణాన్నే నీ వైపుగా..
చరణం1:
నీ తలపులతో మరిగిపోయే ఒంటరితనము ఇష్టమే
నీ కబురులతో కరిగిపోయే ప్రతి ఒక క్షణము ఇష్టమే
కలలే నిజమయేలా కళ్ళు తెరిచిన కోరిక ఇష్టం
నిజమే కల అయేలా ఒళ్ళు మరచిన అయోమయం మరింత ఇష్టం
రా రా రాకుమారా రాజసాన ఏలగా
యెదపై చేరనీరా పూలమాలే నేనుగా..
చరణం2:
బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ
బతకడమంటే ఎంత మధురం నీ చేతులలో తెలియనీ
నేనేం చేసుకోను నీకు పంచని ఈ హృదయాన్ని
ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరో వరం ఏదైన గానీ..
ఆ ఆ ఆ... ఆ ఆ ఆ ఆ ఆ.....
చిత్రం : గోవిందుడు అందరివాడేలే (2014)
సంగీతం : యువన్ శంకర్ రాజా
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : చిన్మయి
No comments:
Post a Comment