నిన్నలా లేదే Lyrics: share this song
ఓ నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే
నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈ వేళిలా ఎందుకే
నువ్విలా నాలో నేనిలా నీలో లీనమై పోయేందుకే
నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే ఓ..
నా ఈ కనులు నీ వైపు తిప్పి
నా ఈ మనసు నీతోటి కలిపి
నేనే నీలో నిలువెల్లా కలిసి
నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి
మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండ చేసి
ఇది ప్రేమా... అనుకుంటూ అడుగేసానా... నేనేనా
నిను నేనే ... ఏవేవో అడిగేసానా... నిజమేనా
నీ నీడలో నేనుండగా నీ అడుగుల వెంటే నేనే కదా
నీ చూపులే నా మనసుని ఆ అడిగేవన్నీ నిజమే కదా
కదిలేనా నీ తలపు లేకుండానే క్షణమైనా
ఓ నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే
కను తెరిచి నీ వైపు చూస్తూ ఉన్నా కనపడదే కనపడదే
కనులెదుట నీ రూపు కదులుతు ఉంది కల కాదె కల కాదె
నీ లోకమై నేనుండగా నీ చూపుల నిండా నేనే కదా
నా ఊపిరై నువ్వుండగా నా ఈ ప్రాణం నీదే కదా
కడ దాకా ఒకటై నిలవాలి ఏమైనా
ఓ నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే
నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈ వేళిలా ఎందుకే
నువ్విలా నాలో నేనిలా నీలో లీనమై పోయేందుకే
No comments:
Post a Comment