PropellerAds

Saturday, 18 March 2017

ఈ వేళలో నీవు - గులాబీ



ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో Lyrics: share this song


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను

నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన్న ఉంటూనే ఎం మాయ చేసావొ

ఈ వేళలో నీవు ఎం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను

నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము...గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేది కనిపించనంటుంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది

నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనె ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను

చిత్రం : గులాబి
గానం : సునీత
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : శశి ప్రీతం

No comments:

Sada ninnu song lyrics-Mahanati