PropellerAds

Monday 17 April 2017

సిన్ని సిన్ని కోరికలడగ - స్వయం కృషి


సిన్ని సిన్ని Lyrics : share this song


సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ ఆ ఆ ఆ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా

సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా

ఎరిగిన మనసుకు ఎరలేలే
ఏలిక శెలవికా శరణేలే
ఎరిగిన మనసుకు ఎరలేలే
ఏలిక శెలవికా శరణేలే

ఎవరికి తెలియని కథలివిలే
ఎవరికి తెలియని కథలివిలే
ఎవరో చెప్పగా ఇక ఏలే

సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా

నెలత తలపులే నలుగులుగా
కలికి కనులతో జలకాలూ..ఊఊఊ..
నెలత తలపులే నలుగులుగా
కలికి కనులతో జలకాలు

సందిటనేసిన చెలువములే
సందిటనేసిన చెలువములే
సుందరమూర్తికి చేలములు
ఆ ఆ ఆ ఆ

సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా
కళల ఒరుపులే కస్తురిగా
వలపు వందనపు తిలకాలూ..ఊఊ..
వలపు వందనపు తిలకాలు

అంకము జేరిన పొంకాలే
అంకము జేరిన పొంకాలే
శ్రీవేంకటపతికికా వేడుకలు..
ఉహు.. ఉహూ... ఉ

సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ ఆ ఆ ఆ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా

సిన్ని సిన్ని కోరికలడగ
శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా

చిత్రం : స్వయంకృషి (1987)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : సిరివెన్నెల
గానం : జానకి


No comments:

Sada ninnu song lyrics-Mahanati