ఈ క్షణం ఒకే ఒక కోరిక Lyrics: share this song
నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో తెలియని దారులలో
ఎక్కడున్నావు అంటోంది ఆశగా
ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది
నిన్ననేగా వెళ్ళావన్న సంగతి
గుర్తేలేని గుండె ఇది...ఆ..
మళ్లీ నిన్ను చూసేదాకా నాలో నన్ను
ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది
రెప్ప వేయనంటోంది ఎంత పిచ్చి మనసు
రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి
నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే
మళ్లీ మళ్లీ తలుచుకుని..ఆ..
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ
ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది
Music: Koti
Artist(s): Chitra

No comments:
Post a Comment